రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం- గువ్వల బాలరాజు, విప్

-

టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, రేవంత్ రెడ్డికి జైలులో శాశ్వత ఖైదీ నెంబర్ ఉండే రోజులు దగ్గరే ఉన్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ కు కొత్తపేరు ప్రస్తుతం కాంగ్రెస్ నిర్వహిస్తున్న జంగ్ సైరన్ అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అంటే ఒక 420 అని అన్నారు. టీఆర్ఎస్ పై, నాయకులపై రేవంత్ రెడ్డి ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని, మేము సహనం కోల్పోతే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. మేము, మాకార్యకర్తలు రంగంలోకి దిగితే బట్టలు ఊడదీసి కొడతాం అని అన్నారు. పోలీసుల లెక్కలు రాస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారని.. రేవంత్ రెడ్డి వాల్ రైటర్ నుంచి అకౌంటెంట్ ప్రమోషన్ వచ్చిందా అని ఎద్దేవా చేశారు. మేము చేసిన దుర్మార్గాలు ఉంటే భయటపెట్టాలని.. సరైన ఆధారాలు లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని రేవంత్ రెడ్డిని హెచ్చిరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version