ఈ సభతో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి : తమ్మినేని

-

వైసీపీ కార్యకర్తగా ‘జయహో బీసీ’ సభలో తాను పాల్గొంటానని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ సభతో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు. అసెంబ్లీకి పోటీ చేయాలని తమ అధ్యక్షుడు జగన్‌ తనకు టికెట్‌ ఇచ్చారని.. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏకంగా సభాపతిని చేశారని చెప్పారు. తాను తొలుత వైసీపీకి చెందినవాడినని.. ఆ తర్వాతే సభాపతినని తెలిపారు. స్పీకర్‌గా సంప్రదాయాలను దాటి రాజకీయాలు మాట్లాడడం ఏమిటని అడుగగా.. గత ప్రభుత్వాలు వాటిని పాటించాయా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను రాజకీయాలు మాట్లాడతానని కరాఖండీగా చెప్పారు. జగన్‌ ఒక పెద్ద బీసీ అని.. పెద్ద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని కొనియాడారు.

రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు సీతారాం. శతాబ్ధాల కాలం నుంచి బీసీలు వివక్షతకు గురయ్యారని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధ్యానత ఇచ్చారన్నారు సీతారాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమ న్యాయం చేస్తూ.. రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ అందరికీ సామాజిక న్యాయం చేసిందన్నారు సీతారాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version