సీపిఆర్ శిక్షణా శిబిరాన్ని నిర్వహించిన తానా న్యూజెర్సీ టీమ్.

-

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘంగా పేరొందిన తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న తెలుగు వారికి ఎంతో చేరువ అయ్యింది. ఎప్పటికప్పుడు విద్యా, వైద్య,  సేవా కార్యక్రమాలని, శిక్షణా శిబిరాలని నిర్వహించే తానా తాజాగా గుండె సంభందిత వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. వివరాలోకి వెళ్తే..

అమెరికాలోని  న్యూజేర్సీ లో ఉన్న తానా టీమ్ ఆధ్వర్యంలో సీపీఆర్ –ఎయిడ్ శిక్షణా కార్యక్రమాని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రమాదవశాత్తు గుండె పోటు వచ్చిన సమయంలో బాధితుడికి ఎలాంటి ప్రధమచికిత్స  చేయాలి, వారిని ప్రాణాపాయ పరిస్థితినుంచీ ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదో కూడా ప్రాక్టికల్ గా వివరిచారు.

డిసెంబర్ 15వ తేదీన న్యూజెర్సీ లోని సౌత్ బ్రన్స్ విక్ లో ఈ కార్యక్రమాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న తెలుగువారు అందరూ పాల్గొన్నారు. అంతేకాదు పిల్లలు సైతం ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శిక్షణ వీడియో అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి పాల్గొన్నారు. జే మాట్లాడుతూ ఇప్పటి వరకూ సుమారు 100 మందికి శిక్షణ ఇచ్చామని. అమెరికాలోని మిగిలిన ప్రాంతాలలో తానా సభ్యులకి శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version