తండేల్ సినిమా టికెట్ ధరల పెంపు..

-

తండేల్ సినిమా బృందానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతినిచ్చింది.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి.

సినిమా విడుదలైన రోజు నుంచి 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదిలాఉండగా, ఈనెల 7వ తేదీన సినిమా థియేటర్ల ముందుకు రానుంది. తండేల్ మూవీని అల్లు అరవింద్ నిర్మించగా.. చందుమొండేటి దర్శకత్వం వహించారు. నాగచైతన్య కెరీ‌ర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తండేల్ మూవీ నిలవనుంది. చైతూకు జోడీగా సాయిపల్లవి కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news