Tarakaratna: తారకరత్నకు గుండెపోటు రావడానికి అసలు కారణం ఇదేనా..?

-

నందమూరి తారకరత్న.. 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం.. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు.. ఒక మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా.. కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి తరలించారు.. అయితే తారకరత్నకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తారకరత్నలు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి 23 రోజులుగా ఆయనకు చికిత్స అందించినప్పటికీ కూడా శనివారం సాయంత్రం మహాశివరాత్రి రోజున తారకరత్న కన్నుమూశారు.

ఇంత చిన్న వయసులోనే మృత్యువాత పడడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే విపరీతమైన ఒత్తిడి కారణంగానే తారకరత్న మృతి చెందాడని భావిస్తున్నారు.. అయితే తారకరత్నను అంతలా టెన్షన్ పెట్టిన అంశాలు ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. తారకరత్న పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ లోలోపల చాలా టెన్షన్ అనుభవించారని తారకరత్న సన్నిహితులు చెబుతున్నారు. నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత కాలంలో వరుస అవకాశాలను అందుకున్నాడు.. కానీ ఆ సినిమాలు తెరపైకి వచ్చేలోపే మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత అవకాశాలు కోల్పోయాడు.. కానీ ఏ రోజు తన సహనాన్ని వీడలేదు.. అలా చివరిగా 2009 అమరావతి సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించి తన విలన్ పాత్రకు నంది అవార్డును కూడా అందుకున్నాడు. గత ఏడాది నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక రాజకీయాలలో ఉన్నత పదవులు చేరుకోవాలని అనుకున్న తారకరత్న చివరి కోరిక తీరకుండానే మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version