ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లంచం..!

-

ఏపీలో ఇప్పుడు ఓ లంచం కేసు సంచ‌ల‌నంగా మారింది. నిత్యం ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచాలు తీసుకుంటున్న సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా క‌నిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. లంచాలు తీసుకునే ప్ర‌భుత్వ ఉద్యోగులు గుట్టు చ‌ప్పుడు కాకుండా తీసుకుంటారు.. త‌న ప‌ని తాము చేసేసి చేతులు దులుపుకుంటారు. కానీ ఈ లంచం మాత్రం ఇప్పుడు ఓ సంచ‌ల‌న విష‌యంగా మారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఓ లంచం వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మార‌డం లంచాల చ‌రిత్ర‌లోనే ఓ రికార్డు కావొచ్చు.

ఇంత‌కు ఏ విభాగంలో ఈ లంచం వ్య‌వ‌హారం జ‌రిగింది. అంత‌లా సంచ‌ల‌నం రేపుతున్న ఈ లంచం వ్య‌వ‌హారం ఏమిటీ అనుకుంటున్నారు.. క‌దా అయితే ఓసారి లుక్కేయండి. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం ముసలిమడుగుకు చెందిన రైతు సంగెం ఏసన్నకు  2.10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తన పేరున  ఆన్ లైన్ చేయాలని తహసీల్దార్ ఆఫీసు చుట్టూ కాళ్ళ‌రిగేలా తిరిగాడు. ఆన్‌లైన్ కోసం వీఆర్వోను వేడుకున్నాడు. అయినా క‌నిక‌రించ‌క పోవ‌డంతో చేసేది ఏమీ లేక ఎంతో మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు రైతు ఏస‌న్న‌. భూమిఆన్ లైన్

చివ‌రికి ఆ రైతు ఆన్‌లైన్ చేయకపోవడంతో ఎందుకు చేయడం లేదని ఆ రైతు ధైర్యం చేసి ఆర్టీఏ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు అధికారుల స‌మాచారం చ‌ట్టం కింద ధ‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద చేసుకున్న ధ‌ర‌ఖాస్తుకు వీఆర్వో సాయిబాబా చెప్పిన సమాధానం ఏపీలో కలకలం రేపుతుంది. వీఆర్వో సాయిబాబా స‌మాచార హ‌క్కు చ‌ట్టం ధ‌ర‌ఖాస్తుకు స‌మాధానం విన్న రైతు ఏస‌న్న విస్తుపోయాడు.   రైతు ఏసన్న భూమిని ఆన్ లైన్ చేయకపోవడానికి కారణం రూ.10వేలు లంచచం ఇవ్వకపోవడమేనని వీఆర్వో సాయిబాబా స్వయంగా సమాచార హక్కు ద్వారా అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వ‌డం విశేషం.

తహసీల్దార్ కుమారస్వామి రూ.10వేల లంచం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, అందుకు తాను నిరాక‌రించాన‌ని అయినా త‌హాసీల్దార్ ఒత్తిడి తెచ్చాడ‌ని.. అవినీతికి తాను పాల్పడలేక రైతుకు సమాధానం చెప్పలేక ఆన్ లైన్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. ఇందులో నా తప్పు లేదని తహసీల్దార్ లంచం కావాలన్నాడని వీఆర్వో సాయిబాబా పేర్కొని సంచ‌ల‌నం నిజాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. కాగా దీనిపై తహసీల్దార్ కూడా ఈ వివాదంపై వివరణ ఇచ్చాడు. వీఆర్వో సాయిబాబా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. అతడికి అక్షరాలు రావు.. సంతకం కూడా సరిగా చేయలేడని.. విధులు సక్రమంగా నిర్వహించకపోతే వారం క్రితమే అతడిని సరెండర్ చేశామన్నారు.

ఆ కోపంతోనే  తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని వివరణ ఇచ్చాడు.  రెవెన్యూ శాఖలో లంచావతారాల ఎపిసోడ్ బహిరంగంగా బయటపడడం ఏపీ రెవెన్యూశాఖనే కుదిపేస్తోంది. త‌హ‌సీల్ధార్ వాద‌న ఇలా ఉంటే ఓ వీఆర్వో వాద‌న మ‌రో విధంగా ఉండ‌టం విశేషం. ఏదేమైనా ఓ లంచం వ్య‌వ‌హారం ఏకంగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం రావ‌డం అంటే లంచాల వ్య‌వ‌హారం ఎంత‌గా సాగుతుందో అద్దం ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version