భారత్ లో కొన్ని రోజుల నుంచి ప్రతీ రోజు కూడా 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఎక్కువగా పరిక్షలు చేయడంతో కేసులు బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం కరోనా పరిక్షల గురించి వారం కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాని ఇప్పుడు అలా కాదు అంటుంది టాటా గ్రూప్. కొత్త టెస్టింగ్ కిట్ ని వేగంగా ఫలితం ఇచ్చే విధంగా తయారు చేసింది.
టాటా గ్రూప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సహకారంతో క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటరప్టెడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ కరోనా వైరస్ టెస్ట్ (CRISPR కరోనా టెస్ట్) తో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ కిట్ వాడకాన్ని ఆమోదించింది. కొత్త కిట్‌కు ఫెలుడా అని పేరు పెట్టారు, ఇది ప్రసిద్ధ రచయిత మరియు చిత్ర దర్శకుడు సత్యజిత్ రే యొక్క కాల్పనిక బెంగాలీ గూడచర్యం సినిమా నుంచి వచ్చిన ఫెలు ‘డా’ నుండి తీసుకున్నారు.