రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సేవలను అతి త్వరలో ప్రారంభించనున్న విషయం విదితమే. అందుకు గాను ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా జియో మొదలు పెట్టింది. అయితే జియో ఇంకా మార్కెట్‌లోకి రాకముందే.. ప్రత్యర్థి కంపెనీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇవాళ భారత్‌లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలను లాంచ్ చేసింది. న్యూఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, థానే, పుణే, అహ్మదాబాద్, మిరా భాయందర్, భోపాల్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, 12 నెలల పాటు వాలిడిటీతో ఈ సేవలు మార్కెట్‌లోకి వచ్చాయి.
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌లో ఒక నెల టారిఫ్ ప్లాన్ 999 రూపాయలతో ప్రారంభమైంది. దీని కింద 5ఎంబీపీఎస్ స్పీడులో అపరిమిత డేటాను అందించనుంది. నెలవారీ డేటా ప్లాన్‌లో 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్ డేటా స్పీడుతో సబ్‌స్క్రైబర్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడుతో రూ.999, రూ.1150, రూ.1,500, రూ.1,800, రూ.2,500 లకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్లలోఅపరిమిత డేటాను అందిస్తున్నారు. అయితే ఇన్‌స్టాలేషన్ ఫీజు కింద సబ్‌స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ ను ఇస్తారు. అలాగే 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.999కు, రూ.1,250కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
మూడు నెలల డేటా ప్లాన్ లో 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడుతో రూ.2,997, రూ.3,450, రూ.4,500, రూ.5,400, రూ.7500 లకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లలోనూ అపరిమిత డేటాను అందిస్తున్నారు. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.2,997కు, రూ.3,750కు రెండు ప్లాన్లను అందుబాటులో ఉంచారు. 12 నెలల డేటా ప్లాన్‌లో 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడుతో రూ.11,988, రూ.13,800, రూ.18,000, రూ.21,600, రూ.30,000 లకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నారు. ఇక 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.11,988కు, రూ.15,000కు రెండు ప్లాన్లు ఈ డేటా ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి.