జగనన్న..పసుపు జెండా ఎగురుతుంది!

-

అవును పసుపు జెండా ఎగురుతుంది..ఈ మధ్య రాష్ట్రంలో పసుపు జెండా ఎగరడం ఎక్కువ కనిపిస్తుంది..ఇక తాజాగా జరిగిన మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది. కార్యకర్తల్లో జోష్ కనబడుతుంది..ఈ సారి వైసీపీ ఎంత అణిచివేయాలని చూసిన సరే కార్యకర్తలు ఆగేలా లేరు. ఇంకా పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చేవరకు విశ్రమించేలా లేరు. కాబట్టి జగన్ గాని, వైసీపీ నేతలు గాని అలెర్ట్ గా ఉండాలనే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే వారికి యెల్లో సిగ్నల్ పడేలా ఉందని చెప్పొచ్చు.

అసలు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక ఎక్కడా కూడా టీడీపీ జెండానే కనిపించలేదు…పూర్తిగా రాష్ట్రమొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది..పూర్తిగా జగన్ స్లోగన్స్ వింపించాయి. అసలు కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో పసుపు జెండానే కనిపించలేదు…అసలు టీడీపీ జెండా కట్టే నాథుడే లేకుండా పోయారు. పూర్తిగా వైసీపీకి భయపడిపోయారు…పైగా ఎక్కడ ఎదురుతిరిగితే కేసులు పెడతారో, జైలుకు వెళ్లాల్సి వస్తుందో అని భయపడ్డారు. అలాగే టీడీపీ పేరు వినబడితే చాలు…వైసీపీ నేతలు గాని, కార్యకర్తలు గాని అణిచి వేసే కార్యక్రమాలే చేశారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు. అంతకంటే ఎక్కువగానే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు..ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. అసలు రాష్ట్రంలో పసుపు జెండానే ఎగరనివ్వకుండా చేశారు. అలాంటిది గత కొంతకాలంగా రాష్ట్రంలో సీన్ మారుతూ వస్తుంది…ప్రతి గ్రామంలో పసుపు జెండా కనిపిస్తుంది..మరి వైసీపీ అణిచివేయడం ఆపేసిందో లేక కేసులకు భయపడకుండా…పోరాడాలని చెప్పి టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి జెండాలు కడుతున్నారో తెలియదు గాని…మొత్తానికి పసుపు జెండాలు ఎగరడం మొదలైంది.

ఇక మహానాడు జరిగిన తీరుని చూస్తే జగన్ కు పరోక్షంగా ఒక అలెర్ట్ వెళ్లిందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో టీడీపీ పికప్ అవుతుందనే అంశం కనిపిస్తుంది..కాబట్టి జగన్ ఇప్పటినుంచి అలెర్ట్ అయ్యి…వైసీపీ బలం మరింత పెంచే కార్యక్రమాలు చేయాలి…అప్పుడే పసుపు జెండాని ఆపవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version