టీడీపీ కీలక నేతలంతా ఆ జిల్లాలోనే ఉన్నారు. ఒకప్పుడు కలిసి మెలిసి తిరిగిన నాయకులే.. ఇప్పుడు స్వపక్షంలో వైరిపక్షంగా మారిపోయారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులకు కొదవ లేదు. అలా అని పార్టీ బలంగా ఉందా అని అనుకుంటే.. మొన్నటి ఎన్నికల్లో అన్నిచోట్ల మాదిరే ఇక్కడా చతికిల పడింది. ఓడినా నెగ్గినా ఇక్కడి నాయకులంతా కలిసి మెలిసి ఉంటారనేది ఒక టాక్. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. టీడీపీ నేతలే ఒకరినొకరు ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ టీడీపీ ఇంఛార్జ్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామరావు మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం చినరాజప్ప, పిల్లి సత్తబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకప్పుడు ఇద్దరు నాయకులు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. చినరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు బొడ్డు భాస్కరరామారావు. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు కాక రేపుతుంటే.. మరోవైపు టీడీపీ నేతల ఆధిపత్య పోరు వేడిపుట్టిస్తోంది. చినరాజప్ప వైఖరికి నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తానంటున్నారు సత్తిబాబు.
అయితే పంచాయితీ ఎన్నికల వేళ తెలుగుదేశం నేతల విమర్శలకు దిగటం రాజకీయంగా చర్చనీయాంశంగామారింది.మెన్నటి వరకు తెర వెనుక ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి..గతంలో పిల్లిసత్తిబాబు మూడో కుమారుడు వివాహేతర సంబందం నేపద్యంలో నమెదయిన కేసును అప్పట్లో హోం మంత్రిగా ఉన్న చిన్నరాజప్ప డీల్ చేశారు.బాదిత మహిళతో పిల్లిసత్తిబాబు కుటుంబం రాజీ కుదుర్చుకోవటంలో చిన్నరాజప్ప కీలక పాత్ర పోషించారు.అయితే ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సదరు మహిళ పిల్లి సత్తిబాబు మూడో కుమారుడు పై ఆరోపణలతో రోడెక్కింది..అయితే వైసీపీ నేతలు ఈ వ్యవహరాన్ని డీల్ చేయటంతో పిల్లి కుటుంబంతో పాటుగా పెళ్లికి హజరు అయిన చిన్నరాజప్ప,యనమల రామకృష్ణుడు పై కూడ అట్రాసిటి కేసు పెట్టారు.ఈ వ్యవహరం రాష్ట్ర స్దాయిలో చర్చనీయాంశంగా మారింది.పిల్లి కుటుంబానికి చిన్నరాజప్ప అండగా ఉండి,అట్రాసిటి కేసును కూడ ఎదుర్కొన్నప్పటికి ఊహించని రితిలో పిల్లి సత్తిబాబు చిన్నరాజప్పకు వ్యతిరేకంగా చక్రం తిప్పారు.తనకు రాజకీయ గురువు అయిన బొడ్డు బాస్కరరామారావు తో జతకట్టి పార్టిలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు.
2019ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుండి సీటు ఆశించిన బొడ్డు బాస్కరరామారావు తనకు సీటు రాకపోవటంతో పార్టి నుండి పోటీ చేసిన చిన్నరాజప్పను ఓడించేందుకు కూడ ప్రయత్నించారన్న ప్రచారం ఉంది.బొడ్డు బాస్కరరామారావుకు సత్తిబాబు సహకరించారని కూడ చెబుతున్నారు.అయితే ఇటీవల కాలంలో బొడ్డుబాస్కరరావు ను తిరిగి పార్టిలో యాక్టివ్ చేసి పెద్దాపురం నియోజకవర్గం టార్గెట్ గా పార్టిలో పావులు కదిపేందుకు పిల్లి సత్తిబాబు ప్రయత్నించటంతో చిన్నరాజప్ప,పిల్లి సత్తిబాబుతో వాగ్వాదానికి దిగినట్లుగా చెబుతున్నారు.రాజకీయ గురువు అయిన బొడ్డు భాస్కరరామారావు ను పార్టిలో క్రియాశీలకం చేసి,ఆయన కొరిక మేరకు వచ్చే ఎన్నికల్లో అయినా పెద్దాపురం సీటు ఇప్పించాలన్న ప్రయత్నం లో పిల్లి సత్తిబాబు బిజిగా ఉన్నారని అంటున్నారు.
అయితే ఈవ్యవహరాలన్నీ బయటకు రావటంతో పంచాయితీ ఎన్నికలను సాకుగా చూపించి అభ్యర్దులను నిలబెట్టలేదన్న కారణంతో చిన్నరాజప్ప,పిల్లి సత్తిబాబును నిలదీయటంతో ఇద్దరి మద్య విభేదాలు బహిర్గతం అయ్యాయని చెబుతున్నారు..బొడ్డు భాస్కరరామారావు కు తాను మద్దతు ఇవ్వటం తో పార్టిలో తనను అవమానించేందుకు ప్రయత్నం జరుగుతుందన్నది పిల్లిసత్తిబాబు వర్గం ఆగ్రహంతో ఉంది.పిల్లి సత్తిబాబు కుటుంబ వ్యవహరాలను సర్దిచెప్పేందుకు వెళ్ళిన తన పై అట్రాసిటి కేసు పెట్టించుకున్నా,ఆ మాత్రం కృతజ్ఞత పిల్లికుటుంబానికి లేకుండా తనకు వ్యతిరేకంగా బొడ్డు బాస్కరరామారావును తన నియోజకవర్గంలోనే రెండో పోల్ సెంటర్ గా తీసుకువచ్చేందుకు పిల్లి ప్రయత్నించటం పై కూడ చిన్నరాజప్ప గుర్రుగా ఉన్నారంట.
ఇద్దరు నేతల మద్య తీరుతో పార్టి పెద్దలకు కూడ వీరిద్దరి వ్యవహరం తలనొప్పిగా మారిందని అంటున్నారు.అందులో భాగంగానే పార్టి సీనియర్ నేత యనమలకు ఈ ఇద్దరి నేతలకు సర్దిచెప్పే బాద్యతలను అప్పగించారని అంటున్నారు.