ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు డే 2: ఆయ‌న‌కు ఈ రోజు కూడా బ్యాడ్‌మార్నింగేనా..!

-

రాజధాని అంశానికి సంబంధించి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభయ‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మొద‌టి రోజు ముగించుకుని రెండో రోజుకు చేరుకున్నాయి. అయితే రెండో రోజు సభలోకి వచ్చిన సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులను ఉద్దేశించి గుడ్‌మార్నింగ్ చెప్పారు. రాజధాని తరలింపునకు నిరసనగా టీడీపీ సభ్యులు స్పీకర్‌కు బ్యాడ్ మార్నింగ్ అంటూ బదులిచ్చారు. అందుకు స్పందించిన స్పీకర్.. తమ సీఎం ఎప్పుడూ చెబుతుంటారని.. కుక్క తోక ఎప్పుడూ వంకరేనని కౌంటర్ ఇచ్చారు.

అంతేకాదు.. ఎవరైనా తెల్లవారి లేచి శుభోదయం అంటారని లేకపోతే గుడ్‌మార్నింగ్ అంటారని స్పీకర్ వ్యాఖ్యానించారు. ‘మీ కర్మది.. బ్యాడ్‌మార్నింగ్’ అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ బదులిచ్చారు. కాగా, మొద‌టి రోజు అంటే నిన్ని కూడా సభలోకి స్పీకర్ తమ్మినేని ప్రవేశించిన వెంటనే ‘బ్యాడ్ మార్నింగ్ సార్’ అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. దీనికి ప్రతిస్పందనగా… ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారని… బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version