ఎన్నికల తరువాత బాబు పని అయిపోయిందని, ఒక్కో నాయకుడు బాబు ని వీడి వెళ్లిపోతారని అందరూ అంటుంటే , తూచ్ అదేమీలేదంటూ కొందరు నేతలు ప్రకటనలు చేశారు. బాబు కి మద్దతు పలికారు. చంద్రబాబు కి కొండంత అండగా ఉంటామన్నారు. ప్రాణం పోయే వరకూ బాబుతోనే జర్నీ అంటూ చెప్పిన కొందరు నేతలు. మధ్యలోనే జర్నీని ఆపేసి ఇప్పుడు కొత్త రాగం అందుకుంటున్నారు. చాటు మాటుగా వ్యవహారాలు నడుపుతూనే చంద్రబాబు వెంటే మేము అంటూనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ కి హ్యాండ్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పలు జిల్లాల కీలక నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారట. టీడీపీ నుంచీ ఎలాగైనా సరే ఒడ్డున పడాలని భావిస్తున్న సదరు నేతలు పవన్ కి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. టీడీపీ ఘోరమైన పరాయజం తరువాత తమకి భవిష్యత్తు లేదని ఫిక్స్ అయిపోయిన నేతలు కొందరు బీజేపీ లోకి వెళ్లాలని భావించినా ఏపీలో కీలకంగా మారాలంటే బీజేపీ కంటే కూడా భవిష్యత్తులో బలపడే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
ఇదిలాఉంటే వైసీపీలోకి వెళ్ళాలని సదరు నేతలు భావించినా జగన్ ప్రస్తుతానికి వైసీపీ గేట్లు మూసేయడంతో చివరికి పవన్ కి దగ్గరవుతున్నారట. అయితే జంపింగ్ ల విషయం తెలుసుకున్న చంద్రబాబు పార్టీ సీనియర్స్ తో జంపింగ్ లని బుజ్జగించడానికి ప్రయత్నించినా లాభం లేక పోగా బాబు తో ఉంటే కష్టం సర్ మీరుకూడా బయటకి వచ్చేయండి అంటూ హితబోధలు చేస్తున్నారట. అయితే ఈ జంపింగ్ రాయుళ్ళు ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచీ అధికంగా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ పవన్ కి దగ్గర అవ్వడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.