‘సీటు’ కోసం తమ్ముళ్ళ రచ్చ..డ్యామేజ్ తప్పదా!

-

ఏపీలో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో పోరు ఉంది..వైసీపీకి పోటీగానే టీడీపీలో కూడా అలాంటి రచ్చ నడుస్తోంది. ఎక్కడకక్కడ నేతల మధ్య సీటు విషయంలో పోరు నడుస్తోంది. ఇప్పటికే విజయవాడలో ఎంపీ కేశినేని నాని సొంత నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..గంటా శ్రీనివాసరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొన్నటివరకు యాక్టివ్ గా లేని గంటా..ఇటీవలే యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎవడండీ గంటా..లక్షల్లో ఒక్కడు..మొన్నటివరకు బొక్కల్లో దాక్కుని, ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని మళ్ళీ రాజకీయం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో చాలామంది నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పలు స్థానాల్లో నేతలు ఎవరికి వారే అంటూ సెపరేట్ గా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేశారు.

యర్రగొండపాలెంలో ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, టీడీపీ నాయకురాలు అజితా రావు, డాక్టర్ రవీంద్రలు..సెపరేట్ గా కార్యక్రమాలు చేశారు. అటు మదనపల్లె, రాయచోటి, రాజంపేట స్థానాల్లో కూడా అదే పరిస్తితి. ఇటు రాజాంలో అంతే..ఇలా నేతలు ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి రాజకీయం చేస్తున్నారు. అయితే వీరంతా సీటు కోసం ఇలా సెపరేట్ అయ్యారని తెలుస్తోంది. ఇలా గ్రూపు రాజకీయాల వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఒకరికి సీటు ఇస్తే…మరొకరు సహకరించే పరిస్తితి లేదు. అవసరమైతే ఓడించడానికి కూడా పనిచేసే ఛాన్స్ ఉంది. ఉదాహరణకు గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె పోటీ చేశారు. కానీ ఆమె ఓటమికి కొందరు నేతలు పనిచేశారనే ఆరోపనలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు అలెర్ట్ అయ్యి..ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలి..లేదంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version