ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు తిప్పలు తప్పవా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో… పలు పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏ విధంగా పోరాడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. దీనితో వారు కేంద్రంతో ఏ మేరకు పోరాడి రాష్ట్రానికి నిధులు తెస్తారు అనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి. లోటు బడ్జెట్ సహా, పోలవరం ప్రాజెక్ట్ నిధులు,
రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యలు, విభజన సమస్యలకు కేంద్రం నుంచి సహకారం అందాల్సి ఉంది . దీనిపై వీరి పోరాటం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే… టీడీపీ కి ఉన్న ముగ్గురు ఎంపీలకు మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని కొన్ని సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. అలాగే కేంద్ర మంత్రుల్లో కొత్త వారితో పరిచయాలు పెంచుకోవాలని,
వారికి రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిస్థితులను వివరించారట చంద్రబాబు. శుక్రవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు దిశా నిర్ధేశం చేశారు. దీనికి సుజనా చౌదరి సహకారం కూడా తీసుకుంటే మంచిదని, కుదిరితే అమిత్ షా తో కూడా సమావేశం కావాలని ఎంపీలకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో టీడీపీ ఎంపీలకు తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. కేంద్రానికి దగ్గర కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారు, జెపి నడ్డా వంటి వాళ్ళ సహకారం ఉన్నా టీడీపీ ఎంపీలు ఏ విధంగా దగ్గరవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సభలో మాట్లాడే అంత సీన్ కూడా వారికి లేదనే అభిప్రాయం వినపడుతుంది.