రేపు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ నేతలు, వారిపై ఫిర్యాదు చేయడానికే?

-

ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది. దీనితో టీడీపీ శ్రేణులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుండి అధికారికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రేపు పార్టీలోని కొందరు కీలక నేతలు కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. వెళుతున్న వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ లాంటి వారు ఉన్నారు. కాగా వీరి అజెండా ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ 6 మరియు 7 కు సంబంధించి జరుగుతున్న అవకతవకలు మరియు BLO లపై ఒత్తిడిని తీసుకువచ్చి వారి ద్వారా అక్రమంగా ఓట్లను తీసివేయడం లేదా చేర్చడం చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఇవ్వడం కాదు, అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తేనే ఫిర్యాదుకు ఒక అర్ధం ఉంటుంది. వారు ఇంతకీ ఎటువంటి ఆధారాలు వీరి దగ్గర ఉన్నాయి మరియు ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version