టెన్షన్: అవును జగన్ బొమ్మ చాలు..వైసీపీ నేతలు గెలవడానికి..ఆయన ఇమేజ్ పైనే ఆధారపడి గెలవాలని చూస్తున్న నేతలు చాలామంది ఉన్నారు. అసలు గత ఎన్నికల్లో వైసీపీకి అన్నీ సీట్లు రావడానికి కారణం జగన్ మాత్రమే. జగన్‌ని చూసే వైసీపీ అభ్యర్ధులకు ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృధ్ది పనులే ఎమ్మెల్యేలకు ప్లస్.
ఇక జగన్ బొమ్మ వల్లే టిడిపికి కూడా టెన్షన్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అందులో వాస్తవం ఉంది. అయితే ఆ స్థానాల్లో టిడిపి బలపడి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు దొరకడం లేదు. దానికి కారణం జగన్ ఇమేజ్. ఆయా స్థానాల్లో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలని చూడటం లేదు..జగన్‌ని మాత్రమే చూస్తున్నారు. దాని టిడిపికి ప్లస్ అవ్వడం లేదు. ఉదాహరణకు ఏజెన్సీ సీట్లు గురించి మాట్లాడుకోవాలి. పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం, పోలవరం లాంటి ఎస్టీ స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏమి పెద్దగా గొప్పగా లేదు.
కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు చేసేది కూడా ఏమి లేదు. దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో టిడిపి బలపడటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ స్థానాల్లో టిడిపి బలపడలేదు. అంటే దాని అర్ధం..అక్కడ ప్రజలు జగన్‌ని మాత్రమే చూస్తున్నారు.
దీంతో ఆయా స్థానాల్లో ఇప్పటికీ వైసీపీకి లీడ్ ఉంది..మళ్ళీ ఆ స్థానాల్లో వైసీపీ గెలవడం పక్కా. ఏదైనా ఒకటి, రెండు స్థానాల్లో ఫలితం మారిన..మిగిలిన స్థానాల్లో జగన్ బొమ్మ చూసే వైసీపీని గెలిపించడం ఖాయం.