అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ.. ఏం జ‌రిగిందంటే..?

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే టీడీపీ తీరుపై స్పీకర్‌ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని స్పీకర్‌ తమ్మినేని మాట్లాడారు.

దీంతో కాసేపు స్పీకర్-చంద్రబాబు మధ్య ఒకింత మాటల యుద్ధం చోటుచేసుకుంది. అయితే స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలంటూ నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version