ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. త్వ‌రలోనే టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ

-

ఏపీ ఎస్సి, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఇవాళ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు ఆర్థర్, గొల్ల బాబూరావు, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ.. . ఏపీ ఎస్సి ఎస్టీ గజిటేడ్ అధికారులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని…రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్ల‌డించారు.

త్వర‌లోనే పెద్ద సంఖ్యలో బ్యాక్ లాగ్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు ఆదిమూల‌పు… రూల్ ఆఫ్ రిజర్వేషన్లల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎస్సి ఎస్టీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పెద్దపీట వేశారని.. నామినేటెడ్ పోస్టులు పనుల్లో బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించారన్నారు. సీఎం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు 80 శాతం బీసీ ఎస్సి ఎస్టీలకు అందుతున్నాయని.. .అంబేద్కర్ ఆశయాలను సీఎం అమలు చేస్తున్నారని స్ప‌ష్టం చేశారు. మాల మాదిగలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని.. మాల మాదిగ రెల్లిలకు వేర్వేరుగా కార్పొరేషన్లు సీఎం ఏర్పాటు చేశారని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version