హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌…గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ ప్రారంభం

-

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌. గాంధీ ఆసుపత్రి లో సీటీ స్కాన్ యూనిట్ సేవ‌ల‌ను ఇవాళ్టి నుంచి అందుబాటు లోకి తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు ఇవాళ మంత్రి హరీష్ రావు… గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించారు. 45 రోజుల్లోనే MRI, cathalab ప్రారంభం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి హారీష్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కరోనా మ‌హ‌మ్మారి సమయంలో ఇక్కడి డాక్టర్స్ అద్భుత సేవలు అందించార‌ని కొనియాడారు.

ప్రైవేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీ ఆస్ప‌త్రిలో సేవలు అందించార‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సిన్ మొదటి డోస్ 95 శాతం పూర్తి అయింద‌ని… రెండో డోస్ 51 శాతం న‌మోదైన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఓమైక్రాన్ వేరియంట్‌ రాలేదని… ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌న్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన 13 మందికి క‌రోనా నెగటివ్ వ‌చ్చింద‌ని … రెండు కేసులు పెండింగ్ ఉన్నాయ‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామ‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version