తెలంగాణాలో ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీపై ఆందోళనకు ఉద్యోగ సంఘాలు దిగాయి. అన్ని సంఘాలతో సీఎం కేసీఆర్ ఒకేసారి చర్చలు జరపాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం, సీఎస్ లు ప్రగతి భవన్లో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. కాలయాపన కోసమే 150సంఘాలతో చర్చలంటున్నారు అని ఆయన అన్నారు.
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల యూనియన్లను రద్దు చేస్తే ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీతో ఉపయోగం లేదు.. పీఆర్సూ కమిషన్ చర్చలు జరిపితే బావుండేది అని ఆయన సూచించారు. కాలయాన కోసమే ప్రభుత్వం కొత్త డ్రామాలను తెరమీదకు తీసుకొచ్చింది అని ఆయన ఆరోపించారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు మరొక తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలి అని సూచించారు.
అణిచివేత అధికమైతే.. తిరుగుబాటు తీవ్ర తరమవుతోంది అని ఆయన హెచ్చరించారు. యూనియన్లు రద్దు చేస్తే ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటమే అని ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఅర్సీ ఇవ్వటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదు అని ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అణుగయణంగా ఫిట్మెంట్ ప్రకటించాలి అని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రభుత్వం కాలయాపన చేయాలని చూస్తోంది అని మండిపడ్డారు.