వరల్డ్ కప్ జెర్సీతో ఫొటోషూట్లో టీమిండియా క్రికెటర్లు

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా టీమ్ ఇండియా ప్లేయర్లు వరల్డ్ కప్ జెర్సీతో ఫొటోషూట్లో మెరిశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, శివమ్ దూబేలు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌తో కూడిన గ్రూప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ మ్యాచులన్నీ అమెరికా వేదికగా జరుగుతాయి. ఈ గ్రూప్‌ స్టేజ్‌ను టీమిండియా అలవోకగా దాటేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version