భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ (66) కన్నుమూశారు. యశ్‌పాల్ గుండెపోటుతో గుండెపోటుతో చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అంతర్జాతీయ కెరీర్ లో మొత్తం 37 టెస్టులు ఆడిన యశ్‌పాల్ .. 1,606 పరుగులు చేసారు. అలాగే మొత్తం 42 వన్డేల్లో 883 పరుగులు సాధించారు. 1983 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో యశ్‌పాల్ సభ్యుడిగా ఉన్నారు. ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి భారత్ విజయంలో యశ్‌పాల్ కీలక పాత్ర పోషించారు.
2000 సంవత్సరంలో టీమిండియా సెలక్టర్ గా కూడా యశ్‌పాల్ పని చేశారు.యశ్‌పాల్ రంజీ ట్రోఫీలో పంజాబ్, హర్యానా మరియు రైల్వే .. మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీల్లో మొత్తం 160 మ్యాచ్‌లు ఆడి 8,933 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి, అత్యధిక స్కోరు 201 నాటౌట్. యశ్‌పాల్ అంపైర్ గా కూడా పని చేసారు. మహిళల వన్డేలకు ఆయన అంపైరింగ్ చేసారు. యశ్‌పాల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. యశ్‌పాల్ మరణం పట్ల మాజీ ఆటగాళ్ళు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.