ధోనిని ముందు చెన్నై వద్దనుకుందా…?

-

చెన్నై సూపర్ కింగ్స్ తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై తన రెండో ఇల్లు అంటూ ధోని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు కూడా. అయితే ధోని చెన్నై ఎంపిక గురించి టీం ఇండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్య బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ…

ఐపీఎల్ 2008 లో ప్రారంభమైందని చెన్నై సూపర్ కింగ్స్ కోసం ముందు వీరేంద్ర సెహ్వాగ్ ని జట్టు యాజమాన్యం ఎంపిక చేసుకుందని, కానీ తాను ఢిల్లీలో పెరిగా అని, అందువల్ల నాకు ఢిల్లీ తో మంచి సంబంధాలు ఉన్నాయని కాబట్టి నేను ఢిల్లీకే ఆడతాను అని సెహ్వాగ్ స్వయంగా చెప్పడంతో తర్వాత ధోనీని ఎంపిక చేసుకున్నారని వివరించాడు. ధోని 2007 ప్రపంచ కప్ కూడా గెలవడంతో ధోనీ వైపు చెన్నై యాజమాన్యం మొగ్గు చూపించిందని అతను పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version