అల్యూమినియంతో ఎంత అందమో తెలుసా?

-

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలాంటి అందాన్ని పొందడానికి మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి ఉంటారు. మరి అలాంటి వాటిలో ఒకటి ఈ అల్యూమినియం. దీనిని వాడటం ద్వారా మన చర్మం మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. దీని వల్ల చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

అల్యూమినియం తరచుగా మొటిమలకు సంబంధించిన చికిత్స కోసం సిఫార్సు చేస్తారు. అల్యూమినియం పౌడర్ ని కొద్దిగా నీటితో కలిపి మొటిమల మీద రాసుకొని 20నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగడం ద్వారా మన మొహం కాంతివంతంగా కనిపిస్తుంది. మన చర్మం మీద ఏర్పడే నల్లటి వలయాలను, మంగును తగ్గించటానికి కూడా అల్యూమినియం ఎంతో గొప్పగా పని చేస్తుంది.

ప్రతిరోజు ఉదయం అల్యూమినియంతో మనం మొహానికి మసాజ్ చేయడం ద్వారా మన చర్మంలోని ధూళి, దుమ్ము, నిర్జీవ కణాలను తొలగించడంతో పాటు ముఖాన్ని చాలా కాంతివంతంగా తయారు చేస్తుంది. దీనిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం ద్వారా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తో బాధపడేవారు అల్యూమినియం పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి దీనిని ముక్కు మీద అంటించుకుని, నెమ్మదిగా మసాజ్ చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అల్యూమినియం ఒక దుర్గంధ నాశినిగా పనిచేస్తుంది.

గడ్డం తీసుకునేటప్పుడు లేదా గుండు తీసినప్పుడు కోతల వల్ల రక్తస్రావం జరుగుతుంది. అలాంటప్పుడు అల్యూమినియం బార్ ని రాయడం వల్ల రక్త స్రావం తగ్గుతుంది. ఈజీ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండటం వల్ల అంటు వ్యాధులను నివారిస్తుంది. అల్యూమినియంను బార్బర్ లు దశాబ్దాల కాలంగా ఆఫ్టర్ షేక్ క్రీమ్ గా వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version