ఏపీలోని ప్రతి నియోజక వర్గం తిరిగితే… అధికారం మాత్రం పవన్ కళ్యాణ్దేనని.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. జనసేన తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు. సామాజిక మార్పు మాత్రమే నా లక్ష్యమని.. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదు.. తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానన్నారు.
వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కొత్త తరం రావాలి…ఓటమికి కుంగిపోనని పేర్కొన్నారు. తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీచేస్తామన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకుకౌంటర్ ఇస్తూ.. తెలంగాణలో కాదు.. నీ ప్రతాపం ఏపీలో చూపించాలని తీన్మార్ మల్లన్న చురకలు అంటించారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు తిరిగితే.. జనసేనదే అధికారం అన్నారు మల్లన్న. వైసీపీ ఓటు చీల్చడం కాదు.. నీ సత్తా ఏంటో అక్కడ చూపించూ అని పేర్కొన్నారు.