తలనొప్పిగా చెల్లని ఓట్లు..ఐ లవ్ యూ మల్లన్న అంటూ రాసి వేశారట..!

-

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ అధికారులకు తలనొప్పిగా చెల్లని ఓట్లు మారాయి. అభ్యర్థులతో పోటీ పడుతున్నాయి చెల్లని ఓట్లు చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోందట.

teenmar mallanna

ఆ క్రమంలోనే కౌంటింగ్ కు ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. పట్టభద్రులకు అవగాహన లోపంతో అత్యధికంగా నమోదవుతున్నాయి చెల్లని ఓట్లు. జై జై మల్లన్న అని కొందరు.. ఐ లవ్ యూ మల్లన్న అంటూ మరి కొందరు.. బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేశారు ఇంకొందరు పట్టభద్రులు. ఇలా అవగాహనా రాహిత్యంతో ఓటు నమోదు చేసుకున్నార పట్టభద్రులు.

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోటీ పడుతూ 5వ స్థానంలో భారీగా నమోదవుతున్న చెల్లని ఓట్లు రెండు రౌండ్లు పూర్తయిన తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్లు

  • కాంగ్రెస్ – 70,785 (తీన్మార్ మల్లన్న)
  • బీఆర్ఎస్ – 56,113 (రాకేష్ రెడ్డి)
  • బీజేపీ – 24,236 (ప్రేమెందర్ రెడ్డి)
  • అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 20,037
  • చెల్లని ఓట్లు – 15,126 చెల్లిన ఓట్లు – 1,77,151
  • మొత్తం లెక్కించిన ఓట్లు – 1,92,277
  • కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ – 14,672

Read more RELATED
Recommended to you

Exit mobile version