తేజస్వి మదివాడ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కేరింత సినిమాల ద్వారా తనకంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె రామ్ గోపాల్ వర్మ కంట్లో పడడంతో ఐస్ క్రీమ్ సినిమా ద్వారా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల ఈమె నటించిన కమిట్మెంట్ సినిమాలో చాలా బోల్డ్ పాత్రలో నటించింది తేజస్వి. ఇక ఈ సినిమా ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజస్వి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.
తేజస్వి మాట్లాడుతూ.. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని , కానీ ఆఫర్లు రావడం లేదు అని ఆమె తెలిపింది. అంతేకాదు ఇప్పటివరకు కేరింత సినిమాలో లాంటి పాత్ర దొరకలేదు అని కొంచెం అసహనం కూడా వ్యక్తం చేసింది తేజస్వి.. ఇకపోతే కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానంటూ తెలిపిన ఈమె 21 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను అని, ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు అని కూడా వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమా మహిళా సాధికారత గురించి చర్చించే సినిమా .. మరో డర్టీ పిక్చర్ లాంటిది అంటూ ఆమె వెల్లడించింది.