టెక్కలి తగాదా: అచ్చెన్నతో కష్టమే?

-

తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఒకరని చెప్పొచ్చు…ఉత్తరాంధ్రలో పార్టీకి అచ్చెన్న ఒక మూలస్థంబం లాంటి నాయకుడు. ముఖ్యంగా శ్రీకాకుళంలో టీడీపీ బలంగా ఉండటానికి ప్రధాన కారణం కింజరాపు ఫ్యామిలీ అని చెప్పొచ్చు…ఎర్రన్నాయుడు తర్వాత సిక్కౌలులో పార్టీ బలం తగ్గకుండా అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు చూసుకుంటూ వస్తున్నారు. అయితే టీడీపీకి అండగా ఉన్న వారిని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలా టార్గెట్ చేసుకుంటూ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే అచ్చెన్నని సైతం జైలుకు పంపించింది.

 

అయితే జైలుకు వెళ్లొచ్చాక అచ్చెన్న ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారే తప్ప..ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యారు..దీంతో ఇంకా దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇలా వైసీపీపై విరుచుకుపడుతున్న అచ్చెన్నకు ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఏదొకవిధంగా అచ్చెన్నని నిలువరించాలని చూస్తున్నారు.

ఇదే క్రమంలో అచ్చెన్న కంచుకోటగా ఉన్న టెక్కలిలో పాగా వేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది…ఇంతవరకు టెక్కలిలో వైసీపీ గెలవలేదు. అయితే ఈ సారి మాత్రం అచ్చెన్నని ఎలాగైనా ఓడించాలనే కసితో వైసీపీ నేతలు ఉన్నారు…ముఖ్యంగా టెక్కలి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్…అచ్చెన్న టార్గెట్ గా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు..ఇదే క్రమంలో మాటల తూటాలు కూడా పేలుస్తున్నారు…తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు.

అయితే మాటలు అన్నంత ఈజీగా…టెక్కలిలో అచ్చెన్నని ఓడించడం కష్టమనే చెప్పాలి..టెక్కలిలో అచ్చెన్న బలం తగ్గలేదనే చెప్పొచ్చు…పైగా ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…ఇలాంటి సమయంలో టెక్కలిని వైసీపీ కైవసం చేసుకోవడం కష్టమైన పని..పైగా దువ్వాడ లాంటి నోరు జారే నేతలని ప్రజలు ఆదరించడం కష్టమవుతుంది…ప్రజలకు ఏదైనా మంచి పనులు చేస్తే ఆదరిస్తారు గాని…ఏదో మీడియా ముందు హడావిడి చేస్తే మాత్రం ప్రయోజనం ఉండదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి…మొత్తానికి టెక్కలిలో అచ్చెన్నని ఓడించడం కష్టమే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version