అచ్చన్న పై ఓడినా అక్కడ ఆ ముగ్గురిదే పెత్తనం…!

-

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టెక్కలి నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ టీడీపీదే ఆధిపత్యం. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని ఓడించడానికి వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. బలమైనా కాళింగ నేతలైన దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌, కిల్లి కృపారాణిలను తెరపైకి తెచ్చింది వైసీపీ. అయినా ఆ ఎన్నికల్లో అచ్చెన్నాయుడే గెలిచారు. ఓడినా ఓవరాల్‌గా అధికారం వైసీపీదే కావడంతో ముగ్గురు కాళింగ నేతలు ఆధిపత్యం కోసం వర్గ పోరుకు తెరతీశారు.

పార్టీ అధికారంలో ఉంటే.. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల చేతికి ఆటోమెటిక్‌గా పవర్‌ వచ్చేస్తుంది. టెక్కలిలోనూ అదే జరుగుతోందట. ESI స్కామ్‌ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయిన తర్వాత ఈ ముగ్గురిలో ఒక నాయకుడు మరింత స్పీడ్ పెంచారంట.అచ్చన్న చేతిలో ఓడిన దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో అంతా తానే అనేలా రిబ్బన్‌ కటింగ్‌లు, ప్రారంభోత్సవాలు, పోస్టింగ్‌లు, బదిలీలు, సమావేశాలు, సమీక్షలు ఒకటేమిటి అన్నింటిలోనూ వేలు పెడుతున్నారట. గతంలో తన మాట వినని పోలీసులు, ఇతర శాఖల అధికారులు బదిలీ చేయించారట. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మాట వినని అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version