బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళిసై

-

రాబోయే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిపై ప్రసంగం లేకుండానే మొదలుకాబోతోన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఇది కొత్త సెషన్ కాదు… గత సమావేశాలకు కొనసాగింపు అని ప్రభుత్వం చెప్పింది. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందని గవర్నర్ తమిళిసై అన్నారు. సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారని.. 5 నెలల తర్వాత సభ సమావేశం అవుతుందని ఆమె అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగమని… నాకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఆమె అన్నారు. గవర్నర్ కు కొన్ని అధికారాలు ఉన్నా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనుమతి ఇచ్చామని అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాది ప్రభుత్వ తీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై అన్నారు. గవర్నర్ ప్రసంగంలోనే సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారని.. ఇప్పుడు తప్పుచేశామని అంటున్నారని తమిళిసై అన్నారు.  ఈనెల 7 నుంచి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై రాజకీయ రచ్చ సాగింది. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య తీవ్ర విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. మహిళా గవర్నర్ కావడంతోనే బడ్జెట్ ప్రసంగం పెట్టలేదని బీజేపీ ఆరోపించింది. గవర్నర్ కార్యాలయానికి కాషాయ రంగు పులమాలని బీజేపీ భావిస్తోందని టీఆర్ఎస్ విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version