లారీ డ్రైవర్లు సమ్మె విరమించుకోవాలని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం ప్రభాకర్ తెలిపారు.లారీ డ్రైవర్లు సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలిగించద్దని , సమ్మెపై పునరలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సెక్రెటరీలు మోటారు వాహన చట్టంలోని 106(2) హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్ ని ఇప్పట్లో అమలు చేయమని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇది ప్రమాదం జరిగిన తరువాత హిట్ అండ్ రన్ కి పాల్పడే వారికి మాత్రమే వర్తిస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ డ్రైవర్స్ కు రవాణా శాఖ అధికారులు అవగహన కల్పిస్తున్నాయి.
కొంతమంది లారీ అసోసియేషన్ లోని సభ్యులు మాత్రమే సమ్మెకు వెళ్తున్నారని మరికొంతమంది ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని మంత్రి అన్నారు. ఒకవేళ భవిష్యత్ లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్స్ & లారీ ఓనర్స్ తో మాట్లాడిన తరువాతనే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ భళ్ళ ఇదివరకే స్పష్టం చేశారు. కాని రేపటి నుండి కొన్ని గుర్తింపు లేని సంఘాలు లారీల సమ్మె చేయాలని భావిస్తున్నారు .