నేడు అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం

-

ఈ నెల ఆరో తేదీన వాయిదా పడ్డ తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు కూడా కొనసాగునున్నాయి. శాసనసభలో కీలకమైన ఏడు బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు కేంద్ర విద్యుత్తు బిల్లు పర్యవసానాలపై ప్రభుత్వం చర్చించనుంది. కేంద్ర విద్యుత్తు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఉభయసభల్లో చర్చించి, కేంద్రం వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది. చర్చలో సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొని ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

సమావేశాల ప్రారంభంలో బీఏసీ తీసుకున్న నిర్ణయాలపై నివేదికను ఉభయసభల్లో  ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభలో మంత్రులు 7 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ జీఎస్టీ సవరణ, హైదరాబాద్‌లోని ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత లీజు రద్దు, క్రమబద్ధీకరణ సవరణ;  పురపాలక చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యనిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయాల ఉమ్మడి పరీక్ష మండలి, రాష్ట్ర మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version