ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు. వీటిని తినిపించే యోధులను యుద్ధానికి పంపేవారట..!

-

వెల్లుల్లికి ప్రాచీనకాలం నుంచే ఎంతో ప్రాముఖ్యత ఉంది. దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోతే ఎంతో ఆరోగ్యం, అలాగే నిద్ర కూడా బాగా పడుతుందని పెద్దోళ్లు బాగా నమ్మేవారు. దీని వినియోగం దాదాపు 7000 ఏళ్ల కిందట ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతుంది. ప్రపంచంలో ఎంతో విచిత్రమైన సంప్రదాయాలు కలిగిన చరిత్ర ఈజిప్టుకే ఉంది. పురాతన ఈజిప్షియన్లు చనిపోయిన వారిని మమ్మీల రూపంలో మార్చడం ఇప్పటికే ఎంతో ఆసక్తికరమైన విషయమే… 3,500 ఏళ్ల క్రితం ఈజిప్టు రాజు టుటాన్ఖామెన్‌ను మమ్మీగా మార్చినప్పుడు, అతని సమాధిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు చల్లారట..

వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు సైన్సు కూడా తలగ్గొంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన చాలా అనారోగ్యాలకు పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్న వారు దీన్ని దిండుకింద పెట్టుకుని నిద్రపోతే, నిద్రకు సంబంధించిన సమస్యలనీ మాయమవుతాయి. ఇది దోమలు, కీటకాలను కూడా మీ దగ్గరికి రాకుండా తరిమికొడుతాయట.. అయితే దీనికి శాస్త్రీయ వివరణ వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటంతో ముడిపడి ఉంది. ఈ సల్ఫర్ వల్లే దాని నుంచి బలమైన వాసన వస్తుందని నిపుణులు అంటారు..

దీనిలో అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. జింక్ , ఐరన్ వంటి ఇతర పోషకాల శోషణను పెంచుతుంది. మధుమేహం నుంచి ఉబ్బసం వరకు అనేక ఆరోగ్య స్థితులపై అల్లిసిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లిసిన్ రక్తపోటును తగ్గిస్తుంది. ప్లేట్‌లెట్స్ గడ్డకట్టకుండా నిరోధిస్తుంది, అంటే రక్తాన్ని పలుచగా చేసి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌పై కూడా పని చేస్తుంది. రక్తంలో చెడు కొవ్వుల పేరుకుపోకుండా చేస్తుంది.

ఈజిప్టు రాజు టుటాన్ఖామెన్‌ను మమ్మీగా మార్చినప్పుడు, అతని సమాధిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు చల్లారట.. 1922లో టుటాన్ఖామెన్ సమాధిని తవ్వినప్పుడు బయటపడ్డాయి. ఇతడు చిన్నవయసులోనే మరణించిన ఈజిప్టు ఫారో. కేవలం 18 నుంచి 19 ఏళ్ల వయసులోనే మరణించాడు. శవం పాడవకుండా ఉండేందుకు చల్లారేమో..

పురాతన గ్రీకు సంప్రదాయంలో దేవాలయాలలో కూడా వెల్లుల్లిని దేవతలను ఆరాధించేందుకో లేక ప్రసాదాలగానో వాడేవారు. గ్రీకులు తమ నావికులకు, యోధులకు వీటిని తినిపించి యుద్ధానికి పంపించేవారని చెబుతారు.

సో.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ వెల్లుల్లికి అంతే ప్రాముఖ్యత, అవే గుణాలు ఉన్నాయి..కానీ మనమే.. వెల్లుల్లిని లైట్‌ తీసుకుంటాం. వీలైనంత వరకూ వంటల్లో వాడేందుకు ప్రయత్నించండి ఇకనైనా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version