ద్రౌపది ముర్ముతో తెలంగాణ బీజేపీ ఎమ్మె్ల్యేలు భేటీ

-

తెలంగాణ అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్‌గా ముద్ర‌ప‌డిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు గురువారం ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ త‌ర‌ఫున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉండ‌గా…వారి ముగ్గురి పేర్లూ ఆంగ్ల అక్షరం ‘ఆర్‌’తోనే మొద‌ల‌వుతున్న నేప‌థ్యంలో టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ పేరుతో ఆ త్ర‌యాన్ని పిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఓటు ఎలా వేయాల‌న్న విష‌యంపై బీజేపీ దేశ‌వ్యాప్తంగా ఉన్న త‌న ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు ఢిల్లీలో శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీ వెళ్లిన రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు ప‌నిలో ప‌నిగా ముర్మును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఫొటోల‌ను ఈట‌ల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version