అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

-

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. అయితే సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడామన్నారు. దశాబ్దకాలంలో తెలంగాణ పురోగతి జరగలేదన్న భట్టి, అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగింది తప్పా, నాణ్యతలేని పనులతో సాగునీటి ప్రాజెక్టులు ఫలితాలు ఇవ్వలేదన్నారు. రైతుల సాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. ఒంటెద్దు పోకడలతో సొంత జాగీరులా గత పాలన సాగిందని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పలా మారిందన్నారు.

2 లక్షల 91 వేల 159 కోట్ల రూపాయలతో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2 లక్షల 20 వేల 945 కోట్లు, మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథిని గుర్తు చేసుకుంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందన్నారు భట్టి విక్రమార్క

Read more RELATED
Recommended to you

Exit mobile version