తెలంగాణ ఉద్యమంలో తప్పుడు ప్రచారం చేశారు : కేసీఆర్

-

తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారని గుర్తు చేశారు.

విద్యుత్‌, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. 15ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందని వివరించారు. అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ అని చెప్పారు.

తెలంగాణ కోసం ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ర‌కాల త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు. భూములు ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని, రాష్ట్రం వ‌స్తే లాభం ఉండ‌ద‌ని చెప్పారు. మన‌కు క‌రెంట్, మంచినీరు ఇవ్వ‌ని వారు మ‌న‌ల్ని గోల్ మాల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌ట్టుద‌ల‌తో 14 ఏళ్లు పోరాడితే చాలా త్యాగాల త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కొత్త జిల్లాల‌ను సాధించుకున్నాం. చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. – కేసీఆర్, ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version