తెలంగాణను మాదిరి దేశాన్ని నంబర్ వన్ చేస్తాం : కేసీఆర్

-

టీఆర్ఎస్ తో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా తీర్చిదిద్దినట్లు బీఆర్ఎస్ తో భారత్ ను ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలబెడతామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజకీయాలంటే తనకు ఓ టాస్క్ అని.. ప్రజలను అభివృద్ధి చేయడానికి వారి సంక్షేమం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంతో ప్రారంభమైన ఉద్యమంతో తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకుని ముందుకు సాగామని అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకుని అనతి కాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకున్నట్టు వివరించారు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం దిగడం తప్ప దేశానికి చేసిందేం లేదని కేసీఆర్ విమర్శించారు. జై తెలంగాణ నినాదంతో ఉద్యమించి మొత్తం భారాన్ని నెత్తిన పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణలో కష్టపడి పని చేసినట్టే దేశం కోసం కష్టపడి పని చేసి  సాధించి చూపెడతామని చెప్పారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్న కేసీఆర్.. అన్నీ చేసి చూయించి బలమైన పునాదుల మీదినించే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version