వాళ్ళలో జోష్ పెరిగింది…గులాబీ బాస్ సెట్ చేస్తారా?

-

మొన్నటివరకు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలకు పెద్ద స్కోప్ లేదనే చెప్పొచ్చు. కేసీఆర్(kcr)దెబ్బకు ప్రతిపక్షాలు సైలెంట్ అయిపోయాయి. కానీ ఊహించని విధంగా తెలంగాణలో ప్రతిపక్షాలు పుంజుకున్నాయి. మూకుమ్మడిగా కేసీఆర్ ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టాయి. అతి తక్కువ సమయంలోనే ప్రతిపక్షాల్లో జోష్ పెరిగింది.

కేసీఆర్ kcr

మొదట ఈటల రాజేందర్‌ని చేర్చుకున్న బీజేపీ దూకుడుగా ఉంటుంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేయాలని చూస్తుంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు దక్కడంతో పరిస్తితి మారింది. కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. ఇక రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రేవంత్ పీసీసీగా బాధ్యతలు స్వీకరిచిన రోజే, కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ వచ్చింది.

దీంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడనుందని తెలుస్తోంది. కేసీఆర్‌కు ధీటుగా బీజేపీనే ఉంటుందని చెబుతున్నారు. ఇలా కాంగ్రెస్-బీజేపీ ఎటాక్‌లతో గులాబీ పార్టీ కాస్త ఆలోచనలో పడిందని విశ్లేషణలు మొదలయ్యాయి. ఈలోపే వైఎస్సార్ తనయురాలు షర్మిల, పార్టీని ఏర్పాటు చేయడం తెలంగాణ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి.

షర్మిల సైతం కేసీఆర్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తుంది. దీంతో ప్రతిపక్షాల దాడి గులాబీ పార్టీపై ఎక్కువైపోయింది. మరి ఈ దాడి నుంచి టీఆర్ఎస్‌ని కేసీఆర్ ఎలా బయటపడేస్తారు? తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులని ఎలా చిత్తు చేయబోతున్నారు? అని గులాబీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. రాజకీయాల్లో కేసీఆర్ ఎత్తుగడలకు ఎవరు సాటిరారు అనే చెప్పొచ్చు. కాబట్టి ప్రతిపక్షాలని కేసీఆర్ ధీటుగానే ఎదురుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ప్రతిపక్షాలకు చెక్ పెట్టి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎంత స్ట్రాంగ్ చేస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version