నేడు ఢిల్లీకి తెలంగాణ సిఎం కెసిఆర్.. షెడ్యూల్ ఇదే !

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ కి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ఉండనుంది. ఈ ఢిల్లీ పర్యటనకు అన్నీ ఏర్పాట్లు చేశారు.  ఇందు లో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

రేపు మధ్యాహ్నం 12:30 గం. ల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక సీఎం కేసీఆర్ తో పాటు భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఢిల్లీ లోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 ల గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక భూమి పూజ కార్యక్రమం అనంతరం  సెప్టెంబర్ 3, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version