తెలంగాణాలో మరో నాలుగు లేదా అయిదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు అన్నీ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ కమిటీకి మురళీధరన్ నాయకత్వం వహించారు.. కాగా ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరిని నిలబెట్టాలని చర్చకొసమట. చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో దాదాపుగా ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ చర్చలో అభ్యర్థుల తుది జాబితాను ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి మురళీధరన్ అందించనున్నారు.
కాగా మరో రెండు రోజుల్లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానుండడంతో అధికారికంగా అక్టోబర్ 14వ తేదీ లోపు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.