అక్టోబరు 9 నుంచి టీఎస్ ఎంసెట్‌ కౌన్సెలింగ్

-

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కౌన్సెలింగ్ను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్లో ఎంపీసీ చదివి ఎంసెట్ ఇంజినీరింగ్ రాసిన విద్యారులు ఈ కౌన్సెలింగ్ ద్వారా బీటెక్, బీఫార్మసీలో సీట్లు పొందవచ్చు.

ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సీట్లను, ప్రైవేట్ కళాశాలల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద ఈ కౌన్సెలింగ్ల ద్వారా భర్తీ చేస్తారు. ఈసారి మొదటి, చివరి కౌన్సెలింగ్లతోపాటు స్పాట్ ప్రవేశాల వివరాలను ముందుగానే వెల్లడించడం విశేషం. ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్, బీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లకు నవంబరు 4న మార్గదర్శకాలు జారీ చేస్తారు.

మొదటి విడత కౌన్సెలింగ్ తేదీలు
-అక్టోబర్ 9-17వ తేదీ వరకు ఆన్లైన్లో సమాచారం పూర్తి చేయడం, ధ్రువపత్రాల పరిశీలనకు తేదీ, సమయాన్ని అభ్యర్థులు ఎంచుకోవాలి.
అక్టోబర్ 12-18వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబర్ 12-20వ తేదీ వరకు: వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 22వ తేదీ: మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 22-27వ తేదీ వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు
అక్టోబర్ 29వ తేదీ: తొలి విడతలో హాజరుకాని వారు ధ్రువపత్రాల బుకింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.
అక్టోబర్ 30వ తేదీ ధ్రువపత్రాల పరిశీలన
నవంబరు 2న: సీట్ల కేటాయింపు
నవంబరు 2-5వ తేదీ వరకు: ట్యూషన్ ఫీజు చెల్లించడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం చేయాలి.
పూర్తి వివరాల కోసం టీఎస్ ఎంసెట్-2020 వెబ్సైట్ చూడవచ్చు.

– శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Exit mobile version