విద్యార్ధులకు తెలంగాణా గుడ్ న్యూస్…!

-

కరోనా వైరస్ కారణంగా ఎక్కువగా నష్టపోయిన వారిలో విద్యార్ధులు కూడా ఉన్నారు. ఈ విషయం అందరికి తెలుసు. విద్యా సంవత్సరం పూర్తి కాక ఎందరో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ఇప్పట్లో పరిక్షలు నిర్వహించే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు. దీనితో చాలా మంది విద్యార్ధుల్లో తాము ఇంటర్ కి వెళ్తామా లేదా అనే ఆందోళన నెలకొంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణా విద్యా మండలి విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్, టీఎస్ ఈసెట్, టీఎస్ ఐసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్‌సెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు. వాటికి దరఖాస్తు చేసుకునేందుకు వేర్వేరు తేదీలను సైతం విద్యా మండలి ఖరారు చేసింది.

అయితే కరోన కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో చాలా మంది విద్యార్ధులు పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ సమస్యను ముందే గ్రహించిన తెలంగాణా విద్యా మండలి… అన్ని సెట్స్ కి సంబంధించి ఫీజు చెల్లింపు గడువు తేదీని ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20వరకు ఏలాంటి లేట్ ఫీజు లేకుండా చెల్లించవచ్చని ఉన్నత విద్యామండలి తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version