ప్రభుత్వాలు కోరుతున్నాయి… మీకు కరోనా లక్షణాలు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి మేము ఉచితంగా చికిత్స చేస్తాము… మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు… మేమే ఖర్చు అంతా భరిస్తామని ప్రభుత్వాలు పూస గుచ్చినట్టు బ్రతిమిలాడి మరీ చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయినా సరే దేశ రాజధాని ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు అందరూ బయటకు రావాలని కోరుతున్నారు.
కాని ప్రభుత్వాలు పట్టుకునే వరకు కూడా ఎవరూ రావడం లేదు. ఇప్పుడు వాళ్ళను ఎవరైనా ఏదైనా అంటే మతాన్ని తిడుతున్నారు అంటారు. మతాన్ని ఎవడు తిడుతున్నాడు…? మీకు దండం పెట్టి చెప్తున్నాము మీరు బయటకు రండి అని కోరుతున్నా సరే ఎవరికి కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించడ౦ ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు.
మా మీద నెపం వేస్తున్నారని కొందరు అనడం మాత్రం నిజంగా ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ప్రజల ప్రాణాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అయినా సరే వాళ్ళు బయటకు స్వచ్చందంగా వచ్చి చికిత్స చేయించుకోవడం లేదు.ఇక్కడ మతాలను ఎవరూ విమర్శించడం లేదు. కేవలం ఇది వ్యక్తులు, ఒక వ్యవస్థ కావాలని చేస్తున్న తప్పు. అందుకే ఇప్పుడు దేశంలో తగ్గినట్టే తగ్గిన కరోనా పెరుగుతుంది.