![telangana government good news for alcohol drinkers](https://manalokam.com/wp-content/uploads/2020/07/vines.jpg)
లాక్ డౌన్ అంటే అందరికన్నా ఎక్కువగా భయపడేది మందుబాబులే. మద్యం లేకపోతే రోజు గడవదు నిదుర కూడా పట్టదు, మరికొందరైతే మద్యం దొరకక పిచ్చి పట్టినట్టు చేస్తూ ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మరోసారి లాక్ డౌన్ పెడతారేమో అనే సూచనలే కనిపిస్తున్నాయి. దీంతో మద్యంప్రియులు వైన్స్ ల ముందు క్యూలు కట్టి నిలుచుంతున్నారు. ఏ వైన్స్ చూసినా ఇదే పరిస్థితి. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుండి రాష్ట్రంలో రాత్రి 9.30 గంటల వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మందు బాబులకు కొంత ఊరట లభించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 93 ప్రకారం నూతన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం, గుడుంబా తయారీ మొదలైందని… అలా అక్రమంగా మద్యం అమ్ముతున్నా వారు కనబడితే ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలియజేసింది.