సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కి ఇవాళ తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయ నిపుణులతో తన నివాసంలో చర్చించారు. అయితే మరోవైపు కేటీఆర్ ఈనెల 16న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తారని భావించి.. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వాస్తవానికి ఏ పిటిషన్ లో కోర్టులో వేసిన తరువాత దానికి కౌంటర్ వేస్తారు. అయితే కేవియట్ పిటిషన్ ముందస్తుగా కౌంటర్ లాంటిదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. కేటీఆర్ సుప్రీంకోర్టులో వేయగానే ఇరువురి వాదనలు వింటుంది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version