పత్తిరైతులకు శుభవార్త.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

-

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వానకాలం- 2022 సాగు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎస్‌ వాణీదేవి,ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో పాటు వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత.. వ్యవసాయానికి గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. రైతు ఒక్కడే నిజాయతీ పరుడని కొనియాడారు. ఎతో కలిసి ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని స్పష్టంచేశారు.

అంతేకాకుండా అధికా సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చుకోసం రూ.4 వేల ప్రోత్సాహకం ఇ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 35 వేల ఎకరాల్లో రైతులతో సాగు చేయించేలా ప్రణాళి రూపొందించింది. ప్రోత్సాహకం రూపంలో రూ.14 కోట్లు ఇవాల్సి ఉంటుందని అంచనా వేసింది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 7 నుంచి 8 వేల మొక్కలు ఉంటే, అధికా సాంద్రత పద్ధతిలో 25 వేలకు పైగా మొక్కలు నాటుతారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version