వ్యాక్సిన్‌ తీసుకోకపోతే.. పింఛన్‌, రేషన్‌ కట్‌.. తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం !

-

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై చర్యలు తీసుకునేందు సిద్ధమైంది సర్కార్‌. రాష్ట్రంలో ఎవరైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోతే…. వారి రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం.

ration-cards

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు కీలక ప్రకటన చేశారు. ఈ నిబంధనలు నవంబర్‌ 1 వ తేదీ నుంచే అమలు చేస్తామని స్పష్టం చేశారు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రావు. కరోనా మూడో వేవ్‌ ను అరికట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా… తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 179 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు కరోనా సోకి మరణించారు. అలాగే.. 104 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version