తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతోంది. మరో నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఓఎంఆర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. మూల్యాంకనం తరువాత ప్రిలిమినరీ ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలను సరిచూస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. అంటే ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది.