ఏపీ రేషన్ కార్డు దారులకు జగన్ తీపికబురు చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న చౌక బియ్యానికి బదులు, పేదలకు చిరుధాన్యాలను అందించాలని భావిస్తోంది. ఇప్పుడు ఆ దిశగా ఫోకస్ పెట్టింది. మూడేళ్ల క్రితం నిలిపివేసిన జొన్నలు, రాగుల పంపిణీ మళ్లీ ప్రారంభించాలి అనుకుంటుంది.
UNO 2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం చిరుధాన్యాలను ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయాలని, రాష్ట్రాల కోసం సూచనలు చేశారు. అందుకే పౌరసరాఫరాల శాఖ రాష్ట్రంలో జిల్లాల వారి విస్తీర్ణం, దిగుబడి ఎంత, ఎంత సేకరించాలనే వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో రేషన్ కార్డు కుటుంబానికి రెండు కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని భావిస్తోంది.