జలుబు కూడా ఒమిక్రాన్ లక్షణమే : తెలంగాణా వైద్యశాఖ

-

థర్డ్ వేవ్ పై తెలంగాణా వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే పండుగలు థర్డ్ వేవ్ కు ప్రారంభమని.. నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాలని సూచనలు చేసింది ఆరోగ్య శాఖ. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని.. భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు డి హెచ్ శ్రీనివాస రావు. తెలంగాణ లోనూ రెండురోజులుగా కేసులు పెరుగుతున్నాయని.. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకమని పేర్కొన్నారు.

ఇది మూడో వేవ్ ఆరంభానికి సూచిక అని.. కేసులు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దు. కానీ అప్రమత్తంగా ఉండాలన్నారు. జలుబు లక్షణాలు కూడా ఒమిక్రాన్ లో ఉన్నాయని.. తెలంగాణ లో పాజిటివ్ రేట్ పెరుగుతోందని వార్నింగ్ ఇచ్చారు. వేరియంట్ ఏదయినా టెస్టుల్లో, ట్రీట్మెంట్ లో మార్పు లేదని.. వైరస్ కన్నా భయమే డేంజర్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో కోవిడ్ నుంచి విముక్తి కలుగొచ్చని.. వాక్సిన్ వేసుకున్న వాళ్లకు, గతంలోనే కరోనా వచ్చిన వాళ్లకు బ్రేక్ తౄ ఇన్ఫెక్షన్ రావచ్చని తెలిపారు. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని.. వైరస్ గాలి ద్వారా వ్యాప్తి జరుగుతోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version